పెంపుడు కుక్క మృతి వివాదంపై స్పందించిన గౌరవ్ తనేజా
రిపోర్టర్: మహేష్
స్థలం: Delhi
తన పెంపుడు కుక్క మౌ మృతిపై వస్తున్న ఆరోపణలను ప్రముఖ యూట్యూబర్ గౌరవ్ తనేజా తీవ్రంగా ఖండించారు. తన ఫామ్‌హౌస్‌లో కుక్కను సరిగా చూసుకోలేదన్న వాదనల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. మౌకు వైద్యం అందించేందుకు తాము ఐదు ఆసుపత్రులకు తిరిగామని, ఈ అంశంపై అన్ని రకాల వైద్య నివేదికలు, రికార్డులను బహిర్గతం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు గౌరవ్ తనేజా వెల్లడించారు.