విజిలెన్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఒంగోలు
ఒంగోలు కలెక్టరేట్లో జిల్లా విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొని పలువురు జిల్లా ప్రతినిధులు, అధికారులతో చర్చలు జరిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారం మరియు అట్రాసిటీ కేసులపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం తరఫున కఠిన చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.