విశాఖను దేశంలోనే అగ్రనగరంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమని గుడివాడ అమర్నాథ్ స్పష్టీకరణ

రిపోర్టర్: కిరణ్ స్థలం: అనకాపల్లి

వైజాగ్ ను దేశంలోనే అగ్రనగరంగా తీర్చిదిద్దడమే జగన్ లక్ష్యమని స్థానిక నేత గుడివాడ Amarnath వెల్లడించారు. విశాఖపట్నంను అన్ని రంగాల్లోనూ దేశంలోనే నంబర్ వన్ నగరంగా అభివృద్ధి చేయాలనేదే తమ పార్టీ ప్రధాన ఆశయమని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ విజయాలను వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. అభ్యర్థుల గెలుపు కోసం అందరూ సమన్వయంతో కృషి చేయాలని ఆయన కోరారు.