'క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు': మంత్రి దామోదర రాజనర్సింహ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల మైదానంలో నిర్వహించిన క్రీడా పోటీలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సరదాగా బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడటంతో పాటు వాలీబాల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. విద్యార్థులు కోరిన వెంటనే జిమ్ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.