నవంబర్ 20న థియేటర్లలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒకతార సినిమా
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆకాశంలో ఒకతార సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ సమర్పిస్తున్న ఈ చిత్రం నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.