అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలిచిన గుత్తి నరసింహ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: చిట్వేల్
చిట్వేల్ మండలంలోని సింగనమాల వీధిలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని రాజుగుంటకు చెందిన గుత్తి నరసింహ, నానబాల నాగార్జున పరామర్శించారు. ప్రమాదం కారణంగా నిరాశ్రయులైన ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు వారు ముందుకు వచ్చారు. ఇంటికి అవసరమైన సామగ్రిని స్వయంగా సమకూర్చి అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న దాతల ఉదారతను స్థానికులు అభినందించారు.