విజయవాడ బస్టాండ్‌లో కలకలం సృష్టించిన జిలెటిన్ స్టిక్స్!

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఎన్టీఆర్ జిల్లా

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ పోలీస్ ఔట్‌పోస్ట్ వద్ద పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. నరసరావుపేట నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజ్ బ్యాగ్‌లో 46 జిలెటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రిక్ డిటోనేటర్లను పోలీసులు గుర్తించారు. బ్యాగ్ ఎవరిది, ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.