టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన లీగల్ సెల్ కన్వీనర్
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను ఆదివారం టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గణేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. లీగల్ సెల్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ఆయనకు వివరించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పనిచేయాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించినట్లు గణేష్ గౌడ్ వెల్లడించారు.