తెనాలి స్టేషన్ సమీపంలో తెగిపడిన విద్యుత్ వైర్లు నిలిచిపోయిన రైళ్లు
రిపోర్టర్: సురేష్
స్థలం: గుంటూరు
గుంటూరు జిల్లా తెనాలి స్టేషన్ సమీపంలో ఓవర్హెడ్ విద్యుత్ వైర్లు తెగిపడటంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గుంటూరు నుంచి రేపల్లె వెళ్తున్న ప్యాసింజర్ రైలు మార్గమధ్యంలోనే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే సాంకేతిక సిబ్బంది వెంటనే స్పందించి విద్యుత్ లైన్ పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.