ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు: ఓట్ల అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలన్న ఎంపీ వంశీకృష్ణ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: పెద్దపల్లి
దేశంలో ఎన్నికల వ్యవస్థ మరియు ఓటర్ల హక్కుల పరిరక్షణపై జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెల్లడించారు. ఓట్లు చోరీ చేసి అధికారంలోకి వచ్చారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రతి ఒక్కరి ఓటు హక్కును కచ్చితంగా కాపాడాల్సిందేనని పేర్కొంటూ, ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై దేశ ప్రజలకు ప్రభుత్వం మరియు ఈసీ స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.