తెలంగాణ బీజేపీ నేతలకు అభయ్ పాటిల్ క్లాస్: నిధుల దుర్వినియోగంపై తీవ్ర హెచ్చరిక

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీజేపీ నేతల తీరుపై సహ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారని నాయకులు తెలిపారు. క్రియాశీల సభ్యత్వం లేని వారికే పదవులు ఇచ్చారని మండిపడ్డారని, పార్టీ నిధులు దుర్వినియోగం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారని వెల్లడించారు. ఏసీ రూముల్లో కూర్చుంటే పదవులు ఊడతాయని సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ కూడా హెచ్చరించారని సమాచారం అందింది.