గణనాథుల నిమజ్జనానికి ముస్తాబవుతున్న బెల్లంపల్లి పోచమ్మ చెరువు
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లోని పోచమ్మ చెరువు వద్ద శనివారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లను మంచిర్యాల డీసీపీ భాస్కర్, సబ్‌కలెక్టర్ మనోజ్, మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన భద్రతా చర్యలు, మౌలిక వసతులు కల్పించాలని అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో దిగ్విజయం చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఘాట్ల వద్ద లైటింగ్, క్రేన్ల ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు.