పులకించిన విజయనగరం వేదికగా సంగీత నృత్య మహోత్సవాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయనగరం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో సంగీత, నృత్య మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కళాశాల ప్రిన్సిపాల్ చాగంటి రాజ్యలక్ష్మి ఈ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. సెప్టెంబర్ 14 నుంచి 23వ తేదీ వరకు పది రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం వివిధ రకాల కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. సంగీతం, నృత్యం, గాత్ర సంగీతం, వాయిద్య విభాగాలలో ప్రత్యేక కార్యక్రమాలు ఉండనున్నాయని తెలిపారు. సంగీత ప్రియులందరూ ఈ వేడుకలను తిలకించి విజయవంతం చేయాలని కోరారు.