స్థానిక సంస్థల ఎన్నికలు: వాయిదా వేయాల్సిన అవసరం లేదన్న ఎస్ఈసీ
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
అర్నబ్ తుపాను కారణంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతానికి చాలా వరకు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ఎస్ఈసీ తరఫున న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ కోర్టుకు తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి వివరాలు తెప్పించుకున్నామని, చట్టం అనుమతించిన మేరకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఎస్ఈసీ వివరణను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ వ్యాజ్యాన్ని పరిష్కరించింది.