పురుగుల మందు డబ్బాతో ప్రజావాణిలో రైతు దంపతుల వీరంగం

రిపోర్టర్: Srinivasulu akavaram స్థలం: మోత్కూరు

భూవివాదం పరిష్కారం కాకపోవడంతో మోత్కూర్ మండల పరిధిలోని బుజిలాపురం గ్రామానికి చెందిన రైతు మడూరి నారాయణరెడ్డి సోమవారం ప్రజావాణిలో పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగారు. ఎనిమిదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అప్రమత్తమై ఆయన నుంచి పురుగుల మందును స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ఈ ఘటనతో కార్యాలయంలో తీవ్ర కలకలం రేగింది.