విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన పల్లా
రిపోర్టర్: రమేష్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నానికి పర్యటన నిమిత్తం విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మరియు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.