ఎస్సీ ప్రజాప్రతినిధులపై వివక్ష అంటూ రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం
రిపోర్టర్: రమేష్
స్థలం: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్
సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత మండలంలోనే ఎస్సీ ప్రజాప్రతినిధులు మరియు మహిళలపై తీవ్రమైన వివక్ష కొనసాగుతోందని సిర్పూర్ నాయకులు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్పీకర్ పై ఉన్న ప్రేమ సర్పంచ్ కాశమ్మపై ఎందుకు చూపడం లేదని ఆయన ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో దళిత ప్రజాప్రతినిధుల పట్ల జరుగుతున్న అవమానాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సరైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.