వైజాగ్ అందాలపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు: గంగవరం బీచ్ ప్రత్యేకతలపై ట్వీట్

రిపోర్టర్: హరి స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలోని గంగవరం బీచ్ సహజ సౌందర్యంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, వైజాగ్ ప్రకృతి అందాలు మరియు ఏఐ టెక్నాలజీ హబ్గా మారుతున్న తీరును కొనియాడారు. ఎత్తైన రాతి కొండలతో కూడిన ఈ తీర ప్రాంతం అద్భుతంగా ఉందని పేర్కొంటూ ఆయన చేసిన ప్రత్యేక ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.