ఆటో డ్రైవర్ కుమార్తె వివాహానికి ఆటో యూనియన్ ఆర్థిక సాయం

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రడగంబాల బస్తీకి చెందిన ఆటో డ్రైవర్ ఎండీ తాజ్ కుమార్తె వివాహానికి బెల్లంపల్లి ఆటో యూనియన్ తరఫున రెండు వేల రూపాయల చెక్కును అందజేశారు. యూనియన్ జనరల్ సెక్రటరీ సాయిని రాజ్యం, అధ్యక్షుడు కట్ట రామ్ కుమార్ చేతుల మీదుగా ఈ సాయం అందించారు. పలువురు దాతల సహకారంతో మరో వెయ్యి రూపాయలు, అలాగే ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణిగుంట్ల ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు బియ్యం బస్తాలు అందజేసి తమ ఉదారత చాటుకున్నారు.