విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హరిత హెచ్చరిక

రిపోర్టర్: మహేష్ స్థలం: ఆసిఫాబాద్

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జిల్లా కలెక్టర్ హరిత శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి, ఎలాంటి అనుమతి లేకుండా గైర్హాజరైన అసిస్టెంట్ ప్రొఫెసర్ పై చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ, బాధ్యతాయుతంగా సేవలు అందించాలని ఆమె హెచ్చరించారు.