న్యాయవిద్య విద్యార్థులకు సీజేఐ సూర్యకాంత్ కీలక సూచనలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: బెంగళూరు
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ న్యాయవిద్య పూర్తి చేసుకుని వృత్తిలోకి అడుగుపెడుతున్న విద్యార్థులు నిజాయతీ, రాజ్యాంగ విలువలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అన్యాయానికి గురైన వారికి అండగా నిలుస్తూ, ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం పెంపొందించాలని పిలుపునిచ్చారు. చట్టాలపై పట్టుతో పాటు ఇతరుల బాధలను అర్థం చేసుకునే గుణం ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు.