స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో గుంటూరుకు జాతీయ పురస్కారం

రిపోర్టర్: రమేష్ స్థలం: గుంటూరు

వాయు కాలుష్య నివారణలో గుంటూరు నగరానికి జాతీయ స్థాయిలో అరుదైన ఘనత దక్కింది. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో 3 నుంచి 10 లక్షల జనాభా విభాగంలో గుంటూరు ద్వితీయ స్థానం సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఎన్జీటీ ఛైర్మన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ చేతుల మీదుగా నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ ఈ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.