వికారాబాద్ జిల్లాలో యువకుడిపై కర్రలతో అత్యంత దారుణంగా దాడి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: వికారాబాద్ జిల్లా

వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో బైండ్ల గోపాల్ అనే యువకుడిపై గునిగరి శ్రీనివాస్, నర్సిములు ఇద్దరు అన్నదమ్ములు కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయిన బాధితుడిని స్థానికులు మొదట పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ గొడవకు సంబంధించిన అసలు కారణాలు తెలియాల్సి ఉంది.