రష్యా చమురు దిగుమతులపై భారత్‌కు అమెరికా టారిఫ్ హెచ్చరిక
రిపోర్టర్: సతీష్
స్థలం: అమెరికా
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్ సహా పలు దేశాలపై అమెరికా భారీ టారిఫ్ ఆంక్షలకు సిద్ధమవుతోంది. రష్యా శాంక్షన్స్ యాక్ట్ 2026 బిల్లులో భారత్ పేరును ప్రత్యక్షంగా చేర్చాలని డెమోక్రటిక్ సభ్యులు ప్రతిపాదించారు. రష్యా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై వంద శాతం సుంకాలు విధించేలా ట్రంప్ సర్కార్ ఈ బిల్లును ప్రతినిధుల సభ ముందుకు తెస్తోంది.