నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో పేదల భూముల బైబ్యాక్ వివాదం

రిపోర్టర్: సురేష్ స్థలం: నిజామాబాద్

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్‌మూర్ గ్రామ రెవెన్యూ శివారులో గతంలో పేదలకు పంపిణీ చేసిన భూములను రెవెన్యూ అధికారులు బైబ్యాక్ తీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. 2012లో సాగులో లేవని చెప్పి అధికారులు నోటీసులు జారీ చేయగా, అప్పట్లో నష్టపోయిన రైతలకు రెండు ప్లాట్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదు. ఆ తర్వాత ఆ భూముల్లో మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి హయాంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు.