ఆలయ భూ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యేను వేడుకున్న భక్తులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వైరా
రామలింగాపురం శ్రీ రామలింగాేశ్వర స్వామి ఆలయ భూ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ భక్తులు ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ భూమి సమస్య ఏళ్లుగా అపరిష్కృతంగా ఉండటంపై గ్రామ పెద్దలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులతో చర్చించి సమస్యను వెంటనే పరిష్కరించాలని భక్తులు విజ్ఞప్తి చేశారు.