భారీ వర్షాల బీభత్సం: ఐదు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటన
రిపోర్టర్: నరేష్
స్థలం: చెన్నై
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైతో పాటు ఐదు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రానున్న రోజుల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ తగిన చర్యలు చేపట్టారు.