'21 వేల పానీ పూరిలతో వినాయక విగ్రహం': పూణేలో అద్భుత సృష్టి
రిపోర్టర్: మహేష్
స్థలం: மகாராஷ்டிரா
మహారాష్ట్రలోని పూణేలో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక వినాయక విగ్రహం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పూణేలోని ఎఫ్సీ రోడ్డులో ఉన్న గణేష్ భెల్ వద్ద ఏకంగా 21 వేల పానీ పూరిలతో సుమారు 13 అడుగుల ఎత్తైన భారీ వినాయక విగ్రహాన్ని నిర్మించారు. గణేష్ భెల్ నిర్వాహకులు రూపేష్, దినేష్ గుడ్మేవర్ ఆలోచన మేరకు కళాకారుడు ప్రశాంత్ సాలుంకే దీనిని రూపొందించగా, పండుగ ముగిసిన తర్వాత వీటితో సేంద్రీయ ఎరువును తయారు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.