బొబ్బిలిలో భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు: అన్నపూర్ణ దేవిగా భక్తులకు దాడితల్లి దర్శనం

రిపోర్టర్: హరి స్థలం: విజయనగరం

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం గొల్లపల్లిలోని దాడితల్లి అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అమ్మవారికి నూటఎనిమిది రకాల పిండి వంటలతో ప్రత్యేక నైవేద్యం సమర్పించి ఘనంగా పూజలు నిర్వహించారు. అర్చకులు పిండప్రోలు మణికుమార్ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు జరగగా, అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.