పర్చూరు నియోజకవర్గంలో రూ.10.04 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: బాపట్ల
పర్చూరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా రూ.10.04 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు ఆనగాని సత్య ప్రసాద్ - రెవెన్యూ శాఖ మంత్రి, రేపల్లె ఎమ్మెల్యే వెల్లడించారు. పావులూరు గ్రామంలో మూడు కోట్ల రూపాయలతో నాగండ్ల–పావులూరు రోడ్డు, కోటి ఐదు లక్షలతో సీసీ రోడ్లు, ఇంకొల్లు మండలంలో ఆరు కోట్ల నూతన సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను ప్రజలకు అంకితం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.