ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యమంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో జరిగిన సమైక్య బిజినెస్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. 2034 నాటికి రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా రాష్ట్రాన్ని మూడు విభిన్న ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.