ఇండియన్ గ్లోరీ పురస్కారంతో మెరిసిన మాచర్ల శివశంకర్

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

హైదరాబాద్ నగరంలోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన కార్యక్రమంలో పల్లిపాడు గ్రామ వాసి మాచర్ల శివశంకర్ కు ఇండియన్ గ్లోరీ అవార్డు రెండు వేల ఇరవై ఆరు ప్రదానం చేశారు. సమాజ సేవ మరియు సామాజిక చైతన్యం అలాగే జాతీయ సమగ్రతకు ఆయన చేస్తున్న కృషిని గుర్తించి నిర్వాహకులు ఈ పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ ఈ గౌరవం తన కుటుంబ సభ్యులకు దక్కుతుందని తెలిపారు.