పొదలకూరులో 108 అంబులెన్స్‌లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన యువతి
రిపోర్టర్: Venkey ...Nlr
స్థలం: పొదలకూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని ఓరుపల్లి గ్రామానికి చెందిన 21 ఏళ్ల కావేరికి పురిటి నొప్పులు రావడంతో బుధవారం రాత్రి 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు తీవ్రమై అంబులెన్స్‌లోనే ప్రసవం జరిగింది. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను ఆస్పత్రికి చేర్చగా, ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సకాలంలో స్పందించి వైద్యం అందించిన 108 సిబ్బందిని స్థానికులు అభినందించారు.