రైతులకు భారీ గుడ్ న్యూస్ రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపు

రిపోర్టర్: రమేష్ స్థలం: న్యూఢిల్లీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2027-28 మార్కెటింగ్ సీజన్కు సంబంధించి ఆరు రబీ పంటలకు ఎంఎస్పీ పెంపు నిమిత్తం రూ.90,962 కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. గోధుమలు, శనగలు, బార్లీతో పాటు వివిధ పంటల మద్దతు ధరను పెంచడం ద్వారా అన్నదాతలకు అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయంపై మంచి మార్జిన్ లభిస్తుందని స్పష్టం చేశారు.