సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరిక
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మంలో సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. పాజ్ ఫర్ సేఫ్టీ–థింక్–వెరిఫై పోస్టర్లను ఆయన బుధవారం ప్రారంభించారు. తెలియని కాల్స్, మెసేజ్‌లు, లింక్‌లను నమ్మవద్దని స్పష్టం చేశారు. బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్లు ఎవరికీ ఇవ్వవద్దన్నారు. డిజిటల్ అరెస్టులు, కేవైసీ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.