పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో వేగం పెంచాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది

రిపోర్టర్: Srinivasulu akavaram స్థలం: మోత్కూరు

నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి కోరారు. శనివారం మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అర్హులైన పట్టభద్రులు నవంబర్ ఆరో తేదీలోపు ఫారం పద్దెనిమిది ద్వారా ఓటు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.