టీ20 క్రికెట్ రికార్డు బద్దలు కొట్టిన పాకిస్థాన్ కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్
రిపోర్టర్: గోపి
స్థలం: పాకిస్థాన్
శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో పాకిస్థాన్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ మొత్తం 238 పరుగులు సాధించి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడని ఐసీసీ వెల్లడించింది. భారత బ్యాటర్ అభిషేక్ శర్మ పేరిట ఉన్న 229 పరుగుల రికార్డును ఆయన అధిగమించారని అధికారులు తెలిపారు. సిరీస్లో వరుసగా అర్ధశతకాలు బాదిన ఫర్హాన్ అత్యధిక పరుగులు చేసిన పూర్తి సభ్య దేశాల జాబితాలో తొలి స్థానంలో నిలిచారని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.