ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పును స్వాగతించిన హరీష్ రావు

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి కొనసాగింపుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును మాజీ మంత్రి హరీష్ రావు గట్టిగా స్వాగతించారు. రాజ్యాంగ విలువల పరిరక్షణకు ఈ తీర్పు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని విమర్శిస్తూ, నిజంగా ప్రజాస్వామ్యంపై నిబద్ధత ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ప్రజా తీర్పు కోరాలని ఆయన సవాల్ విసిరారు.