తీవ్ర తుపాను ముప్పు: నెల్లూరు - నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: నెల్లూరు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడిందని, సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు - నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మురసు తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.