లక్సెట్టిపేటలో ఉపాధి హామీ పనులు చేపట్టాలంటూ అశోక్ గర్జన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: లక్సెట్టిపేట

లక్సెట్టిపేట మున్సిపాలిటీలో ఉపాధి హామీ పనులు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కనికారపు అశోక్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఇటిక్యాలలో చలో హైదరాబాద్ కరపత్రాలు విడుదల చేశారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో గ్రామీణ ఉపాధి చట్టం అమలు చేసి కూలీలందరికీ ఉపాధి కల్పించాలని, ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మరియు కూలీలు పాల్గొన్నారు.