సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వింత కంపెనీ నిబంధనలు

రిపోర్టర్: శివ స్థలం: India

భారతీయ కార్పొరేట్ రంగంలో ఓ కంపెనీ పెట్టిన వింత నిబంధనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మూడు నెలల ప్రాబేషన్ కాలంలో రాజీనామా చేయడానికి వీలేదని, నెలకు ఒక్క లీవ్ మాత్రమే ఇస్తామని, అది కూడా మొదటి నెల వర్తించదని పేర్కొనడం విశేషం. అంతేకాకుండా, జీతం ప్రతి నెలా 12వ తేదీన ఇస్తామని తెలపడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.