పులివెందులలో ప్రశాంతంగా పోలింగ్: మాజీ సీఎం జగన్ ఆరోపణలను ఖండించిన కలెక్టర్
రిపోర్టర్: గోపి
స్థలం: Kadapa
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ స్పందించారు. పులివెందులలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఏజెంట్లు రిపోర్ట్ చేయకపోవడం వల్లే కొన్ని చోట్ల అనుమతించలేదని, నిబంధనల ప్రకారమే అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, నిర్భయంగా వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.