విజయవాడలో దసరా ఏర్పాట్లపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయవాడ
విజయవాడలో దసరా శరన్నవరాత్రుల ఏర్పాట్లపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెల పదకొండు నుంచి ఇరవై వరకు ఉత్సవాలు జరగనున్నట్లు ఆయన తెలిపారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతారని స్పష్టం చేశారు. సామాన్యులకు పెద్దపీట వేస్తూనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.