అక్రమ గ్రావెల్ తవ్వకాలతో మృత్యు కుహరాలుగా మారుతున్న గుంతలు

రిపోర్టర్: రమేష్ స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో ప్రభుత్వ భూములు మరియు డీకేటీ పట్టా భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్ మట్టిని యథేచ్ఛగా త్రవ్వి లేఅవుట్లకు తరలిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. అనుమతులకు మించి లోతుగా తవ్వడంతో భారీ గోతులు ఏర్పడి వర్షాకాలంలో ముప్పుగా మారుతున్నాయని తెలిపారు. ఈ అక్రమ తవ్వకాలపై మైనింగ్ అధికారులతో మాట్లాడి కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ విజయ్ స్పష్టం చేశారు.