మురసు తుపాన్ ప్రభావం: జిల్లాల అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
రిపోర్టర్: కిరణ్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ లో మురసు తుపాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం తెల్లవారుజామున జిల్లా కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ప్రాణనష్టం జరగకుండా అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు రోడ్లపైకి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. బాపట్ల, నెల్లూరు, ఒంగోలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్ లోని పరిస్థితులపై ఆరా తీసిన సీఎం, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు.