ముద్విన్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఘనంగా భూమిపూజ
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులను ఘనంగా ప్రారంభించారు. సర్పంచ్ పొగాకు సంధ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ భూమిపూజ కార్యక్రమంలో బీజేపీ నేత తల్లోజు ఆచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ నిర్మాణంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.