వారణాసి చిత్రంపై రాజమౌళి కీలక ప్రకటన: తండ్రీకొడుకుల భావోద్వేగ ప్రయాణమంటూ వెల్లడి
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
మహేష్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న వారణాసి చిత్రం కేవలం యాక్షన్ చిత్రమే కాదని, విడిపోయిన తండ్రీకొడుకుల బంధం చుట్టూ అల్లుకున్న భావోద్వేగ ప్రయాణమని దర్శకుడు రాజమౌళి తెలిపారు. బ్రెజిల్లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఆయన ఈ విశేషాలను పంచుకున్నారు. సినిమా షూటింగ్ ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ ఏడవ తేదీన ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని రాజమౌళి స్పష్టం చేశారు.