భారత్ ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్ల ఏర్పాటుకు భారీ పెట్టుబడులు
రిపోర్టర్: అశోక్
స్థలం: Hyderabad
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రపంచ స్థాయి టెక్ సంస్థల నుంచి భారీ పెట్టుబడులు వరుస కడుతున్నాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్, టీసీఎస్ హైపర్‌వాల్ట్, కంట్రోల్ ఎస్, ఫార్చ్యూన్ హాస్పిటాలిటీతో పాటు తాజాగా ఎస్బీఐ డేటా సెంటర్ కోసం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేట్ పరిధిలో పది ఎకరాల భూమి కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.