ఉద్యమకారుల వేదిక మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా లింగంపల్లి రాజలింగు నియామకం
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
తెలంగాణ ఉద్యమం ఉద్యమకారుల వేదిక మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా జన్నారం మండలానికి చెందిన ఉద్యమ కళాకారులు లింగంపల్లి రాజలింగు నియమితులయ్యారు. ఈ మేరకు వేదిక రాష్ట్ర కన్వీనర్ నరాల సత్యనారాయణ తదితరులు గురువారం మధ్యాహ్నం ఆయనకు నియామక పత్రం అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో ధూమ్ ధామ్ కళాకారుడిగా గుర్తింపు పొంది ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తున్నందుకు రాజలింగుకు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినట్లు వారు తెలిపారు. ఈ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.