కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో శోభ: స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన నాయిబ్రాహ్మణ సంఘం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఐరాల

చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కామధేను వాహన సేవ సందర్భంగా స్థానిక నాయిబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవస్థానం కల్యాణ కట్ట నుంచి మంగళవాద్యాల నడుమ ఊరేగింపుగా తెచ్చి వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు సునీత, సుబ్బారెడ్డి, అధికారులు, కామధేను వాహన ఉభయదారులు విశేషంగా పాల్గొన్నారు.